Showing all 6 resultsSorted by popularity
-

$16.99
ఏమో గుర్రం ఎగురావచ్చు అని కలలు కన్న రోజులను మర్చిపోగలమా? పుష్పక విమానంలో ఇంద్రసభకు వెళ్ళగలమనే భ్రాంతితో గడిపిన రోజులను మర్చిపోగలమా? అద్భుత దీపం నుండి వచ్చిన భూతం సాయం పొందగలమని అపోహ పడిన రోజులను మర్చిపోగలమా? ఒంటి కన్ను రాక్షసుడితో యుద్ధం చేసి గెలవగలమనే ధీమాతో ఉన్న రోజులను మర్చిపోగలమా? మాయల మాంత్రికుడు ఎత్తుకెళ్లిన రాజకుమారిని కాపాడి ఆ రాజ్యానికే రాజవ్వచ్చని ఆశ పడిన రోజులను మర్చిపోగలమా? పున్నమి వెన్నెల్లో, గోదావరి ఇసుక తిన్నెల్లో స్నేహితులతో…
-

$15.99
‘కరేపాకు’ కథలన్నీ పల్లె ప్రజల మనస్తత్వాలను ఆవిష్కరిస్తాయి . స్త్రీల అగచాట్లను చిత్రీకరిస్తాయి .వాటితో పాటు వాళ్ల నిత్యజీవితంలోని అందచందాలను, కుటుంబ వ్యక్తులతో వారికున్న బంధాలను వ్యక్తీకరిస్తాయి . ఆడవాళ్ల అభిప్రాయాలను కరేపాకులా తీసిపారేసే పురుషాధిక్య సమాజానికి చెంప పెట్టు ఈ కథా సంపుటి . ఈ కథల లోని భావ సౌందర్యంతో పాట, చిత్తూరి మాండలికంలోని సొబగులు కథల్ని పట్టి చదివిస్తాయి . పాఠకునిలో ఆ పదజాలం గురించి తెలుసుకోవాలనే ఆసక్తిని రేకెత్తిస్తాయి.
-

$23.99
పవిత్రమైన ‘అపరాజిత’ పూర్తిగా చదివితే ఆనందం, శాంతి లభిస్తాయి. మనస్సు ను శుద్ధి చేసుకోవడానికి ఇలాంటి పుస్తకాలు తప్పక చదవాల్సిందే. ఇలాంటి పుస్తకం చదవాలి అంటే ముందుగా అహాన్ని విడిచిపెట్టాలి. లోకాలనేలే శ్రీ దుర్గ దేవి కి మరొక పేరు అపరాజిత. లోకాలనేలే అపరాజితా దేవికే కాదు ఆమెను నమ్ముకున్న భక్తులకి కూడా అపజయం అన్నది ఉండదు. చల్లని ఆ తల్లి ఆగ్రహ అనుగ్రహాలను చవిచూసిన ఒక రాజకుటుంబం యొక్క కథే ఈ అపరాజిత. కలం పేరు…
-

$15.99
‘తస్మాత్ జాగ్రత్త’ ‘స్వతంత్రమా జాగ్రత్త’ ‘ నెట్టింటి భాగోతం’ నాటికల గురించి వివరించాలంటే ..’తస్మాత్ జాగ్రత్త’ నాటికలో ప్రతీ పాత్ర ఒక తరానికి సంబంధించింది. అన్నీ కలిసి ఒక సంప్రదాయం గురించి చెబుతాయి. ముఖ్యంగా పర్యావరణం ఆధారంగా రచించడం జరిగింది. చారుమతి పాత్ర తన పాతకాలం పద్ధతులని పాటించమంటే, కొడుకు సోమయాజులు కాలాన్ని బట్టి మారాలి అంటాడు. కాశీపతి అవకాశాన్ని ఎలా వాడుకోవాలో చెబుతాడు. కాకి కామేశం ఎలా వాడుకోవాలో చూపిస్తాడు. ఇక అద్దేపల్లి పాపారావు లాంటి…
-

-

$20.99
ఒక స్పూర్తి కలిగించే వార్త చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం, అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా “మధుమంజీరాలు” . – ఉప్పలూరి మధుపత్ర శైలజ